- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Damodara Rajanarsimha: కల్తీకల్లు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించండి: మంత్రి దామోదర
కల్తీకల్లు ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహా విచారం వ్యక్తం చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కూకట్ పల్లి కల్తీకల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. బాధితుల్లో నిన్న ఒకరు మృతి చెందగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా (Damodara Rajanarsimha) విచారం వ్యక్తం చేశారు. నిమ్స్ డాక్టర్లతో ఫోన్ లో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులందరికీ మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. కాగా నిన్న కల్లు కాంపౌండ్ లో కల్లు తాగిన వారిలో 19 మంది అస్వస్థతకు గురయ్యారు. కాగా ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్‌ను సీజ్ చేసినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story






