- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Damodar Rajanarasimha: ఈఎస్ఐ హాస్పిటల్ ప్రమాద ఘటనపై దామోదర్ రాజనర్సింహ విచారం
సనత్ నగర్ ఈఎస్ఐ ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులతో ఆరా తీశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. హైదరాబాద్ డీఎంహెచ్‌వో, డాక్టర్ వెంకటిని తక్షణమే హాస్పిటల్‌కు వెళ్లాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు డీఎంహెచ్‌వో వెంకటి హాస్పిటల్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనలో మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని మంత్రి భగవంతున్ని ప్రార్థించారు. కాగా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు భవనంలో పునర్నిర్మాణ పనులు చేపడుతుండగా సెంట్రింగ్ కూలి కార్మికులపై పడింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.






