- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సనత్ నగర్ టిమ్స్ లో ఎమర్జెన్సీ కేర్ కోసం 300 పడకలు
అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలు నిలిపే గొప్ప హాస్పిటల్‌గా సనత్ నగర్ టిమ్స్ ను దీన్ని తీర్చిదిద్దుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

- ప్రస్తుతం హాస్పిటల్ లో వైద్య సేవల ట్రయల్ రన్ విజయవంతంగా నడుస్తోంది
- జూన్ లో టిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభిస్తాం
- టిమ్స్ సందర్శన అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
దిశ, తెలంగాణ బ్యూరో : అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలు నిలిపే గొప్ప హాస్పిటల్‌గా సనత్ నగర్ టిమ్స్ ను దీన్ని తీర్చిదిద్దుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. వెయ్యి పడకలతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రిలో 300 పడకలు ఎమర్జెన్సీ కేర్ కోసమే కేటాయించామని అన్నారు. సనత్‌నగర్ టిమ్స్‌లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌ను మంత్రి మంగళవారం పరిశీలించారు. ఓపీ రిజిస్ట్రేషన్, ఐపీ వార్డులు, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ల్యాబులు, మెకనైజ్‌డ్ ల్యాండ్రీ, కిచెన్ తదితర అన్ని డిపార్ట్‌మెంట్లను మంత్రి పరిశీలించారు. పెండింగ్ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి సూచించారు. హాస్పిటల్‌కు నీళ్లు, పవర్ సప్లైలో ఎలాంటి ఆటంకం ఉండకూడదని, 24 గంటల సరఫరా ఉండాలని, ఫైర్ సేఫ్టీ విషయంలో రాజీ ఉండకూడదని, అన్ని ఫ్లోర్లలో మరోసారి పూర్తిస్థాయి పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. రిసెప్షన్ ఏరియా, హెల్ప్ డెస్క్, ఓపీ కౌంటర్లు, వెయిటింగ్ హాల్, ఓపీ కన్సల్టేషన్ రూమ్స్, డయాగ్నస్టిక్స్, ఇన్ పేషెంట్ వార్డులు, ఫార్మసీ తదితర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి.. రిజిస్ట్రేషన్ కౌంటర్స్, ఫార్మసీ కౌంటర్స్ పెంచాలని మంత్రి సూచించారు. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్ రే, ఆల్ట్రాసౌండ్ తదితర యంత్రాలను పరిశీలించిన మంత్రి.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యంత్రాలు పూర్తిస్థాయిలో పేషెంట్లకు ఉపయోగపడాలని, ఇందుకు అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రారంభం నాటికి అన్ని సౌకర్యాలతో హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలు, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలకు ఈ హాస్పిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఉంటుందని... ఇక్కడే అద్భుతమైన రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి వెంట హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ, డీఎంఈ డా. నరేంద్ర కుమార్ ఉన్నారు.






