వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు చకచకా.. మంత్రి దామోదర ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు చకచకాగా జరుగుతున్నాయి.

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు చకచకా.. మంత్రి దామోదర ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరంగల్‌లో నిర్మిస్తున్న (Warangal Super Specialty Hospital) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు చకచకాగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర‌లో ఈ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఆసుపత్రికి సంబంధించి ఎక్స్ వేదికగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) కీలక అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ చివరి నాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిద్ధం అవుతోందని ప్రకటించారు. ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో ఇప్పటికే 75 శాతం నిర్మాణ పనులు పూర్తి అయినట్లు వెల్లడించారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించడమే లక్ష్యంగా దీన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పెంచిన నిర్మాణ వ్యయాన్ని కుదించి, నిర్మాణ సంస్థకు పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు ఆసుపత్రిలో ఏర్పాటు చేసే ఎక్విప్ మెంట్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు.

ఈ ఆసుపత్రిలో 3 బ్లాకులు, 34 విభాగాల్లో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించనుందని పేర్కొన్నారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 జూన్‌లో 24 అంతస్తులతో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొదట రూపొందించిన ప్రతిపాదనలను సవరిస్తూ మరింత విస్తరిస్తూ రేవంత్ సర్కార్ పనులు ప్రారంభించింది. దీని నిర్మాణం, మెడికల్ ఎక్యూప్‌మెంట్, ఇతర పనుల కోసం అప్పటి ప్రభుత్వం రూ.1,116 కోట్ల నిధులను కేటాయించింది.

Next Story