- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి బర్రెలను తోలిన రైతు
by Muthe.Rajitha |
తన నిరసనను ఎలా తెలపాలో తెలియని ఓ పాడిరైతు ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో తన బర్రెల మందను తోలి.. ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు.

X
దిశ, వెబ్ డెస్క్ : తన నిరసనను ఎలా తెలపాలో తెలియని ఓ పాడిరైతు ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో తన బర్రెల మందను తోలి.. ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ పాడిరైతు తన బర్రెల షెడ్‌ను కూల్చివేసినందుకు నిరసనగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి బర్రెలను తోలుకొచ్చిన ఘటన సంచలనం రేపింది. పాడిరైతు కురాకుల ఓధెలు తన బర్రెల షెడ్‌ను స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి నిరసనగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి బర్రెలను తోలుకొచ్చాడు.
ఈ ఘటనతో ఆఫీసులో ఉన్న నేతలు, కార్యకర్తలు మరియు సందర్శకులు గందరగోళానికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పాడిరైతును, అతని భార్యను పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనకు న్యాయం చేయాలని ఆ రైతు పోలీసులను కోరారు.
Next Story






