- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cyclone Senyar: తెలంగాణకు మళ్లీ భారీ వర్షాలా? తీవ్రమైన చలిగాలులా?
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఎల్లుండి (సోమవారం)కి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లోనే వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడి తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని తెలిపింది.
ఈ తుపానుపై తెలంగాణ వెదర్ మ్యాన్ రెండు పాజిబిలిటీల గురించి విశ్లేషించారు. నవంబర్ 26 -28 మధ్య సమయంలో తుపాను ఏర్పడితే అది నార్త్ ఏపీ, ఈస్ట్ తెలంగాణ జిల్లాలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఫలితంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఒకవేళ నవంబర్ 28 నుంచి 30 మధ్య సమయంలో తుపాను రూపాంతరం చెందితే అది భయంకరమైనదిగా మారుతుందని, ఒడిశా, బంగ్లాదేశ్, బర్మాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. ఇలా జరిగితే మాత్రం తెలంగాణలో మళ్లీ చలితీవ్రత విపరీతంగా పెరుగుతుందని హెచ్చరించారు.






