సైబ‌రాబాద్‌లో ఉగ్ర‌దాడికి కుట్ర‌.. ఎన్ఐఏ నివేధికలో సంచలన విషయాలు

by Ajay Maddhiboyina |

క‌ర‌డుగ‌ట్టిన ఉగ్ర‌వాద సంస్థ ల‌ష్క‌రే తొయిబా సైబ‌రాబాద్‌లోనూ పేలుళ్లకు ప్రణాళిక రచించిందని ముంబాయి పేలుళ్ల ప్రధాన సూత్రదారుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీ షాకింగ్ నిజాలు బయటపెట్టాడు.

సైబ‌రాబాద్‌లో ఉగ్ర‌దాడికి కుట్ర‌.. ఎన్ఐఏ నివేధికలో సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: క‌ర‌డుగ‌ట్టిన ఉగ్ర‌వాద సంస్థ ల‌ష్క‌రే తొయిబా సైబ‌రాబాద్‌లోనూ పేలుళ్లకు ప్రణాళిక రచించిందని ముంబాయి పేలుళ్ల ప్రధాన సూత్రదారుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీ షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. ముంబాయి(Mumabi) పేలుళ్ల కేసులో ప్రధాన నింధితుడు తహవ్వుర్ హుస్సేన్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రస్తుతం విచారిస్తోంది. 2010లోనే ఎన్ఐఏ(NIA) హెడ్లీని విచారించింది. ఈ నివేధికలో హెడ్లీ సంచలన విషయాలను బయటపెట్టాడు.

తాను భారత్‌పై యుద్ధం ప్రకటించిన ఎల్‌ఈటీ(LET) తరఫున పనిచేసినట్టు హెడ్లీ వెల్లడించాడు. ఉగ్రదాడుల ప్రణాళికలో భాగంగా తాను అనేకసార్లు భారత్ వచ్చినట్టు తెలిపాడు. లష్కరే తొయిబాలో తాను ఆయుదాలు వాడటానికి సంబంధించి మూడు నెలల పాటూ శిక్షణ తీసుకున్నట్టు స్పష్టం చేశాడు. ఇండియాలో చేయబోయే ఉగ్రదాడులకు సంబంధించి ఎల్ఈటీ సభ్యులు చూపించిన మ్యాప్‌లో రాజ్ కోట్‌లోని చమురుశుద్ధి కర్మాగారం, హైదరాబాద్‌లోని సైబరాబాద్ (Cyberabad) ఉన్నాయని చెప్పాడు.

తనను భారత్ పంపాలని సంస్థ అనుకున్నప్పుడు అనుకూలంగా ఉండే నగరాలు హైదరాబాద్, నాగ్‌పూర్, కోల్ కత్తా, పూణే, బెంగుళూరు అని చర్చ జరిగిందని తెలిపాడు. కానీ ఆ తరవాత టూరిస్ట్ ముసుగులో తనను ముంబాయికి పంపించారని అక్కడ రెక్కీ నిర్వహించి దాడులకు పాల్పడినట్టు చెప్పాడు. హెడ్లీ డెన్మార్క్‌లోనూ దాడులకు ప్రాణాళిక రచించడంతో అతడిని ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది. అప్పుడే ముంబాయి పేలుళ్లలో సూత్రదారి అనే విషయం తెలిసింది.

Next Story