Cyberabad Police: పాన్ కార్డు 2.0.. ప్రజలకు సైబరాబాద్ పోలీసులు వార్నింగ్..!

by Maddikunta Saikiran |   (  Updated:2024-12-17 15:23:45  IST  )

కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఇటీవలే పాత పాన్ కార్డుల స్థానంలో పాన్ కార్డు 2.0(PAN Card 2.0) ప్రాజెక్టు పేరుతో కొత్త పాన్ కార్డులను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Cyberabad Police: పాన్ కార్డు 2.0.. ప్రజలకు సైబరాబాద్ పోలీసులు వార్నింగ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఇటీవలే పాత పాన్ కార్డుల స్థానంలో పాన్ కార్డు 2.0(PAN Card 2.0) ప్రాజెక్టు పేరుతో కొత్త పాన్ కార్డులను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా క్యూఆర్ కోడ్(QR Code)తో కూడిన పాన్ కార్డులను కేంద్రం జారీ చేయనుంది. ఇందుకోసం దాదాపు 1,435 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇదిలా ఉంటే పాన్ కార్డులను అప్డేట్(Update) చేస్తామంటూ కొందరు సైబర్ నేరగాళ్లు(Cyber ​​Criminals) కాల్స్ చేసి ప్రజల నుంచి సొమ్మును దోచేస్తున్నారు.

ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. స్కామర్ల(Scammers) పట్ల జాగ్రత్తగా ఉండాలని, మోసాలకు దూరంగా ఉండాలని సోషల్ మీడియా 'ఎక్స్(X)' వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రభుత్వం పాన్ కార్డులను అప్డేట్ చేసిన తర్వాత వాటిని పోస్ట్ ద్వారా డైరెక్ట్ రిజిస్టర్ అడ్రస్(Register Address)కే పంపిస్తుందని పేర్కొంది. పాన్ కార్డు అప్డేట్ చేస్తామని ఎవరైనా మిమ్మల్ని కాల్స్(calls), మెస్సేజులు(Messages), ఈ-మెయిల్స్(E-Mails) ద్వారా సంప్రదిస్తే పట్టించుకోవద్దని తెలిపారు. అలా ఎవరైనా చేస్తే 1930 నంబర్ కి కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్(Cyber ​​Crime Portal)లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Next Story