రాంగ్​రూట్​లో వెళ్తున్నారా? అయితే రేపటి నుంచి వెళ్లకండి! ట్రాఫిక్ పోలీస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

వేగంగా గమ్యం చేరాలనే ఆత్రుతతో వాహనదారులు కొంత మంది రాంగ్‌‌రూట్‌లో ప్రయాణిస్తున్నారు.

రాంగ్​రూట్​లో వెళ్తున్నారా? అయితే రేపటి నుంచి వెళ్లకండి! ట్రాఫిక్ పోలీస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Hyderabad Traffic Rules) వేగంగా గమ్యం చేరాలనే ఆత్రుతతో వాహనదారులు కొంత మంది రాంగ్‌‌రూట్‌లో ప్రయాణిస్తున్నారు. యూటర్న్‌లు, స్నిగల్స్ వద్ద వేచి ఉండటం ఇష్టపడని వాహనదారుడు రాంగ్ రూట్ (Wrong Route Driving) డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవ్వడం, ప్రమాదాలు జరుగుతున్నాయి. రాంగ్ రూట్ ప్రయాణం డేంజర్ అని చెప్పిన, అలాంటి వారికి ఫైన్లు వేస్తున్నా కూడా మార్పు మాత్రం అంతంత మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో చాలా మంది రాంగ్ రూట్ కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యల్లో భాగంగా రాంగ్ రూట్ ప్రయాణంపై నిరంతరం నిఘా పెట్టెలా గతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా రాంగ్‌రూట్ డ్రైవింగ్‌పై (Cyberabad Traffic Police) సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆసక్తికర ట్వీట్ చేసింది. ట్రాఫిక్ రూల్స్ పాటించ కుండ రాంగ్ రూట్‌లో పోయే వాహనాల ఫోటోలు, వీడియోలు సెండ్ చేయాలని (WhatsApp) వాట్సాప్ నెంబర్ షేర్ చేసింది. 9490617346 నెంబర్‌కు వాట్సప్ చేసి లోకేషన్, డేట్, టైమ్ లాంటి పూర్తి వివరాలు షేర్ చేయాలని ట్వీట్‌లో పేర్కొంది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఎవరైనా అలా వెళితే వారికి భారీగా ఫైన్ రావడం ఖాయమని, అందుకే రేపటి నుంచి అలా చేయవద్దని డేంజర్ డ్రైవింగ్ చేసేవారికి నెటిజన్లు సూచిస్తున్నారు.

Next Story