- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్కరికి రెండేసి పోస్టులు: 24మంది టౌన్ ప్లానింగ్ అధికారుల బదిలీలు
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ)లో 21 మంది టౌన్ ప్లానింగ్ అధికారులను బదిలీ, పోస్టింగ్ ఇస్తూ కమిషనర్ జి.సృజన శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ)లో 21 మంది టౌన్ ప్లానింగ్ అధికారులను బదిలీ, పోస్టింగ్ ఇస్తూ కమిషనర్ జి.సృజన శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు కొరత కారణంగా ఈ బదిలీల్లో ఒక్కొక్కరికి రెండు పోస్టులు ఇచ్చారు. బి.భాస్కర్ కు టీపీఓతోపాటు మేడ్చల్ సర్కిల్ ఇన్ చార్జి అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసీపీ)గా బాధ్యతలు అప్పగించారు. ఎం.ప్రసాద్ కు టీపీఓతోపాటు అమీన్ పూర్ ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. హబీబున్నీసాకు టీపీఓతోపాటు మాదాపూర్, ఆల్వీన్ కాలనీ సర్కిళ్లకు ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారు.కె.సుష్మకు టీపీఓతోపాటు మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లకు ఏసీపీగాను, సురేందర్ రెడ్డికి కూకట్ పల్లి, మూసాపేట్ సర్కిళ్లకు ఏసీపీగాను, ఐ.రాణికి జీడిమెట్ల, కోంపల్లి సర్కిళ్లకు ఏసీపీగాను, ఎం ప్రసీద్దాకు నార్సింగి, పటాన్ చెరు ఏసీపీగాను, ఇ.శ్రీనివాస్ కు దుండిగల్, నిజాంపేట్ ఏసీపీగాను బాధ్యతలు అప్పగించారు. జీషాన్ కు కూకట్ పల్లి జోన్ ఆఫీసులో ఏసీపీగాను, భార్గవి సాయిని శేరిలింగంపల్లి జోన్ ఆఫీసులో ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారు.






