సైబర్ మాఫియా టార్గెట్ ఒంటరి వాళ్లే

by Malleboina Mahesh |

ఒంటరితనాన్ని క్యాష్ చేసుకుంటున్న సైబర్ మాఫియా.. ఐటీ యూత్, వృద్ధులే టార్గెట్‌గా డేటింగ్ యాప్స్, డీప్‌ఫేక్స్‌తో కోట్లలో డిజిటల్ దోపిడీ!

సైబర్ మాఫియా టార్గెట్ ఒంటరి వాళ్లే
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉండి, మనసులో మాట పంచుకోవడానికి ఎవరూ లేక ఎమోషనల్ సపోర్ట్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారా..?.. కొత్త పరిచయాల కోసం డేటింగ్ యాప్స్ లేదా ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్ సైట్లలో లాగిన్ అవుతున్నారా..?.. అయితే బీ కేర్‌ఫుల్.. సైబర్ క్రిమినల్స్ వెతుకుతున్న ఫస్ట్ టార్గెట్ మీరే. ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు అడిగి దోచుకున్న కేటుగాళ్లు.. ఇప్పుడు రూటు మార్చారు. ఆధునిక సమాజంలో మనిషి అనుభవిస్తున్న అతిపెద్ద సమస్య అయిన ఒంటరితనాన్ని తమకు బిజినెస్ మోడల్‌గా మార్చుకున్నారు. కష్టమొస్తే పలకరించేవారు లేక ఎమోషనల్‌గా వీక్ అయిన వారిని టార్గెట్ చేస్తూ రూ. కోట్లు దండుకుంటున్నారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న అనేక సైబర్ మోసాల కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. లోన్లీనెస్ ఎకానమీ ముసుగులో సైబర్ మాఫియా సాగిస్తున్న డిజిటల్ దోపిడీ ఇప్పుడు తెలంగాణ ముందున్న బిగ్గెస్ట్ క్రైసిస్‌గా మారుతోంది.

ఐటీ కారిడార్‌లో హనీట్రాప్..

హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ఐటీ కారిడార్‌లలో ఈ సైబర్ ఫ్రాడ్స్ పీక్ స్టేజ్‌లో ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, విపరీతమైన జాబ్ స్ట్రెస్ కారణంగా చాలామంది ఐటీ యూత్ సోషల్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోతున్నారు. ఆన్‌లైన్ మీటింగ్స్ తప్ప ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్ లేక డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఈ ఎమోషనల్ గ్యాప్‌ను ఫిల్ చేసుకునేందుకు వారు ఇన్‌స్టా‌గ్రామ్, టిండర్, బంబుల్ లాంటి యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే సైబర్ క్రిమినల్స్ క్యాట్‌ ఫిషింగ్.. నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. అందమైన అమ్మాయిలు లేదా అబ్బాయిల ఫొటోలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి పరిచయం పెంచుకుంటారు. బాధలు వింటున్నట్లు నటిస్తూ ఎమోషనల్‌గా దగ్గరవుతారు. ఆ తర్వాత ప్రైవేట్ వీడియో కాల్స్, ఫొటోలు షేర్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చి..వాటిని రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. పరువు పోతుందన్న భయం తో బాధితులు లక్షల రూపాయలు సమర్పించుకుంటున్నారు.

సీనియర్ సిటిజన్స్‌పై సింపతీ స్కామ్..

సైబర్ నేరగాళ్ల కన్ను యూత్‌పైనే కాదు.. ఎన్నారై పిల్లల తల్లిదండ్రుల పైన పడింది. పిల్లలు ఫారిన్‌లో సెటిల్ అవ్వడంతో హైదరాబాద్‌లోని లగ్జరీ అపార్ట్‌మెంట్లలో సింగిల్‌గా ఉంటున్న సీనియర్ సిటిజన్స్ వీరికి సాఫ్ట్ టార్గెట్స్. సోషల్ మీడియాలో వృద్ధులను ఫాలో అవుతూ, వారికి కంపానియన్ లాగా, ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే వ్యక్తుల్లా మెసేజ్‌లు చేస్తారు. నెలల తరబడి రోజూ మాట్లాడుతూ.. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్‌లతో పూర్తి ట్రస్ట్ బిల్డ్ చేస్తారు. ఆ తర్వాత సడెన్‌గా మెడికల్ ఎమర్జెన్సీ అనో, లేదా విదేశాల నుంచి ఖరీదైన గిఫ్ట్ పంపామని కస్టమ్స్ డ్యూటీ కట్టాలనో ఎమోషనల్ డ్రామా ఆడి లక్షలు కాజేస్తున్నారు. డబ్బులు పంపకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ గిల్ట్ ట్రిప్ ప్లే చేసి మరీ అకౌంట్లు ఖాళీ చేయిస్తున్నారు.

డీప్‌ఫేక్స్‌తో ఫ్రెండ్‌షిప్.. ఆపై బ్లాక్‌మెయిల్..

టెక్నాలజీ పెరిగేకొద్దీ సైబర్ నేరగాళ్ల మోసాలు మరింత స్మార్ట్‌గా మారుతున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్‌ఫేక్స్, వాయిస్ క్లోనింగ్ టూల్స్ వాడి నకిలీ ఆత్మీయతను సృష్టిస్తున్నారు. అవతలివైపు ఉన్నది మనిషో, లేక ఏఐ బాటో కనుక్కోలేనంత పర్‌ఫెక్ట్‌గా ఈ మోసాలు సాగుతున్నాయి. పెయిడ్ ఫ్రెండ్‌షిప్ సైట్లలో గంటలకొద్దీ మాట్లాడుతూ విక్టిమ్స్ ఎమోషన్స్‌ను పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అబ్జర్వేషన్ ప్రకారం.. ఈ తరహా మోసాల్లో బాధితులు తమ తప్పును బయటపెట్టడానికి సిగ్గుపడి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. దీంతో సైబర్ క్రిమినల్స్ మరింత రెచ్చిపోతున్నారు.

రియల్ కనెక్షన్స్‌ను మించిన ఫైర్‌వాల్ లేదు.. : సైబర్ క్రైమ్ డీసీపీ వి.అరవింద్ బాబు

ఒంటరితనానికి డిజిటల్ వరల్డ్‌లో సొల్యూషన్ వెతకడం అంటే.. సైబర్ క్రిమినల్స్ వేసిన ఉచ్చులోకి స్వచ్ఛందంగా వెళ్లి పడటమే. వర్చువల్ వరల్డ్‌లో చూపించే సింపతీ అంతా ఫేక్, అది కేవలం మీ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ను కొల్లగొట్టే ట్రాప్ మత్రమే అని గుర్తించాలి. సైబర్ మాఫియా పన్నుతున్న ఈ డిజిటల్ మాయాజాలం నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే.. మన ఫోన్లకు వేసుకునే యాంటీ వైరస్‌లు సరిపోవు. బంధువులు, స్నేహితులు, స్థానిక సమాజంతో మనం బిల్డ్ చేసుకునే రియల్ హ్యూమన్ కనెక్షన్స్ మాత్రమే ఈ మోసాలను అడ్డుకునే అతిపెద్ద ఫైర్‌వాల్. డిజిటల్ స్క్రీన్లను పక్కనపెట్టి, పక్కనున్న మనుషులతో మనసు విప్పి మాట్లాడటమే మానసిక ఆరోగ్యానికి, సైబర్ భద్రతకూ అసలైన రక్ష.

Next Story