- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్
సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో విద్యార్థుల కోసం స్టూడెంట్ ప్రోగ్రామ్ ఫర్ అవెర్ నెస్ అండ్ రెస్పాన్సిబుల్ సైబర్ స్పెస్

సైబర్ ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్
రాష్ట్రలో 8శాతం తగ్గిన సైబర్ నేరాలు..
58వేల ఎఫ్ఐఆర్‌లు, రూ.350కోట్లు రిఫండ్
6వారాల పాటు సైబర్ అవగాహన కార్యక్రమాలు
ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన డీజీపీ డీజీపీ శివధర్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: సైబర్ నేరాల నియంత్రణ పై అవగాహన కలిగించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరీటీ బ్యూరో ( టీజీసీఎస్‌బీ) ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాఫ్ ప్రచార కార్యక్రమాన్ని డీజీపీశివధర్ రెడ్డి ప్రారంభించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రలో సెంటర్లో సైబర్ సెక్యూరిటీ డీజీ ఆధ్వర్యంలో సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ ఫ్రాడ్ కా ఫుల స్టాప్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగా స్వాములు కావాలని పిలుపునిచ్చారు. 6వారాల పాటు నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనిట్లు పాల్గొనాలని తెలిపారు. అనుమానస్పద సోషల్ మీడియాలో వచ్చే లింకులకు, ఆర్థిక ఆఫర్లకు దూరంగా ఉండాలని సూచించారు. ట్రేడింగ్ ఫ్రాడ్ తో ఓ వ్యక్తి రూ.14కోట్ల నష్ట పోయిన సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాడని వివరించారు.
సాఫ్ట్ వేర్‌గా చేస్తున్న 30ఏళ్ల యువతితో ఓ వ్యక్తి సన్నిహితంగా మెలిగి రూ.40లక్షల రుణాలు తీసుకుని మోసం చేశాడని తెలిపారు. ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణలో దేశంలో అగ్రగామిగా ఉన్నామని అందుకు కృషి చేస్తున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరోను అభినందిస్తున్నట్లు పేర్కోన్నారు. సైబర్ నేరాల నియంత్రణ పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. ఆరు వారాల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాలలో డిజిటల్ అరెస్ట్ , ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, ఓటీపీ/కెవైసి మోసాలు, లోన్ యాప్ హెరాస్‌మెంట్ , సోషల్ మీడియా ఎక్స్ టార్షన్ వంటీ ప్రధాన మోసాలపై ప్రజలకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని పేర్కోన్నారు.
రాష్ట్రంలో 8శాతం తగ్గిన సైబర్ నేరాలు – టీజీసీఎస్‌బీ డీజీ శిఖా గోయల్
దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు 29శాతం పెరిగాయని అదే సమయంలో రాష్ట్రంలో 8శాతం తగ్గాయని డీజీ శిఖా గోయల్ వెల్లడించారు. ఆర్థిక నష్టం దేశ వ్యాప్తంగా 6శాతం తగ్గితే రాష్ట్రంలో 30శాతం తగ్గినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పడిన నాటి నుంచి .244లక్షల ఎన్‌సీఆర్‌పి ఫిర్యాదులు అందాయని , 58,244 ఎఫ్ఐఆర్‌లు నమోదు అయినట్లు వెల్లడించారు. సైబర్ బాధితులకు రూ.350కోట్ల రిఫండ్ చేసినట్లు తెలిపారు.
సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో విద్యార్థుల కోసం స్టూడెంట్ ప్రోగ్రామ్ ఫర్ అవెర్ నెస్ అండ్ రెస్పాన్సిబుల్ సైబర్ స్పెస్( స్పార్క్ సైబర్ క్లబ్స్) ప్రారంభించమన్నారు. విద్యార్థులను స్కూళ్లు , కాలేజీలు సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతాయని తెలిపారు. ఎస్‌బీఐ భాగస్వామ్యంతో సిబ్బందితో సైబర్ డిఫెండర్స్ అవగాహాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీజీపీఎ డైరక్టర్ అబిలాష బిస్త్, ఇంటిలిజెన్స్ ఏడీజీపీ విజయ్ కుమార్, టీజీ నాబ్ డైరక్టర్ సందీప్ శాండిల్యా, హైదరాబాద్ సీపీ సజ్జనార్ , సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐసీసీసీ డైరక్టర్ కమల్ హసన్ రెడ్డి, మాజీ ఐపిఎస్ ఎఆర్ శ్రీనివాస్ , ఐజీ రమేష్ నాయుడు, ఈగల్ డీఐజీ అభిషేక్ మహంతి, డీసీపీలు అరవింద్ బాబు, సుధీంద్ర, నాగలక్ష్మీ, ఎస్సీలు హర్షవర్ధన్, సాయిశ్రీ పాల్గొన్నారు.
ఆరు వారాల పాటు నిర్వహించే కార్యక్రమాలు
* మొదటీ వారం – సైబర్ సారధి@1930 – గోల్డెన్ అవర్ రిపోర్టింగ్ , 1930 హెల్ప్ లైన్
* 2వ వారం – స్కామ్ సే బచో – డిజిటల్ అరెస్ట్ , సెక్స్‌టార్షన్ సైబర్ స్లేవరి
* 3వ వారం – పైసా పైలం – ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ , లోన్ యాప్స్ , ఫేక్ రివార్డ్స్
*4వ వారం– హర్ స్క్రీన్ సురక్షా – హ్యకింగ్ ,రామ్‌సమ్‌వేర్ , ఫేక్ యాప్స్ , బెట్టింగ్
*5వ వారం– మెరా లాగిన్ మేరా రూల్ – ఐడెంటీటీ థెఫ్ట్ , ఇన్ ఫర్‌మేషన్ , ఒటీపీ, కెవైసి మోసాలు
*6వ వారం – మహిళ రక్షణ పిల్లల సంరక్షణ – మహిళలకు, పిల్లలకు , సంబంధించిన అన్లైన్ ముప్పులు






