- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
50 వేల పెట్టుబడికి 8 వేలు లాభం.. ఆశపడి 1.44 కోట్లు పెట్టుబడి...
డాలర్స్ లో వడ్డీ లేని రుణం మంజూరు అయ్యిందంటూ ఆశ పుట్టించి 1.44 కోట్లు కొట్టేసారు.

దిశ, సిటీక్రైం: డాలర్స్ లో వడ్డీ లేని రుణం మంజూరు అయ్యిందంటూ ఆశ పుట్టించి 1.44 కోట్లు కొట్టేసారు. ఆశ పడి మోసపోయిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఏల్బి నగర్ హస్తినాపురం ప్రాంతానికి చెందిన (45) ప్రైవేట్ ఉద్యోగి. మే 3 వ తేదీన సచిత రెడ్డి పేరు తో ఓ యువతి వాట్సాప్ కాల్ చేసి మార్కెట్ యాక్సస్ యాప్ ద్వారా ట్రేడింగ్ లో పెట్టు బడి పెడితే భారీ లాభాలు అంటూ కొన్ని లావాదేవిల స్క్రీన్ షాట్స్ ను చూపించింది.
దీనికి ఆకర్షితుడైన ప్రైవేట్ ఉద్యోగి ముందుగా 50 వేలు పెట్టుబడిగా పెట్టాడు. ఓకే రోజులో 8 వేలు లాభం వచ్చింది విత్ డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత పెట్టుబడిని పెట్టుకుంటూ వెళ్ళాడు. తనకు కేటాయించిన పేజీ లో లాభాలు కనపడుతున్నాయి కాని విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తే మీ ట్రాక్ రికార్డు దెబ్బ తింటుంది అని మాయ చేసారు. ఇలా బాధితుడు మొత్తం 1.44 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు.
జూన్ 6 మీ ట్రాక్ రికార్డు చూసి మీకు 1.08 లక్షల అమెరికా డాలర్ లాలో లోన్ వచ్చింది దీనికి వడ్డీ లేదు.... వారంలో తిరిగి చెల్లించాలని అప్పటి వరకు వీటిని ట్రేడింగ్ లో పెట్టి లాభాలు తీసుకుందామని నమ్మించారు. దీంతో లోన్ నగదు తనకు మార్కెట్ యాక్సస్ యాప్ ఇచ్చిన అకౌంట్ లో జమ అయ్యినట్లు చూపించారు.
వీటి తో చేసిన ఇంకా భారీ లాభాలను చూపించారు. విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తే మీరు లోన్ డబ్బు కట్టండి అంటూ చెప్పారు. దీంతో ఇది మోసమని గుర్తించి బాధితుడు 1.44 కోట్లు నష్టపోయినట్లు నెల రోజుల తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.






