- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VC Sajjanar: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. సైబర్ నేరగాళ్లు కొత్త దందా ఇదే: వీసీ సజ్జనార్
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు (Cyber criminals) ప్రజలను మాయ చేసేందుకు రెడీగా ఉన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్, పాకిస్తాన్‌ల మధ్య తాజాగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు (Cyber criminals) ప్రజలను మాయ చేసి డబ్బులు దోచేందుకు రెడీగా ఉన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త స్ట్రాటజీలతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా శుక్రవారం టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ (VC Sajjanar) పోస్ట్ చేశారు. (Tensions at the borders) సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఆర్మీ అధికారులమంటూ సందేశాలు పంపుతూ.. అందిన కాడికి దండుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, డొనేషన్ సందేశాలను నమ్మి డబ్బు చెల్లిచకండని సూచించారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ దోస్త్ ఫోటోను సజ్జనార్ షేర్ చేశారు. అందులో కేంద్ర బలగాల పేరుతో ఫేక్ డొనేషన్స్ సేకరిస్తారు.. డొనేషన్ రిక్వెస్ట్ వస్తే.. చేసే ముందు వెరిఫై చేసుకోవాలని సూచించారు. ఫేక్ డొనేషన్ రిక్వెస్ట్ అనిపిస్తే.. దాన్ని రిపోర్ట్ కొట్టాలని, cybercrime.gov.inకు ఫిర్యాదు చేయాలని సూచించారు.






