iBOMMA : ఐబొమ్మ రవికి భారీ షాక్‌.. మొత్తం 5 కేసులు నమోదు

by Ramesh Naini |   (  Updated:2026-02-12 14:58:10  IST  )

సినిమా పైరసీ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన IBOMMA రవికి సైబర్ క్రైమ్ పోలీసులు భారీ షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఒక కేసులో అరెస్టు చేసి విచారిస్తున్న పోలీసులు, అతడిపై నమోదైన మిగతా నాలుగు కేసుల్లోనూ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

iBOMMA : ఐబొమ్మ రవికి భారీ షాక్‌.. మొత్తం 5 కేసులు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినిమా పైరసీ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన IBOMMA రవికి సైబర్ క్రైమ్ పోలీసులు భారీ షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఒక కేసులో అరెస్టు చేసి విచారిస్తున్న పోలీసులు, అతడిపై నమోదైన మిగతా నాలుగు కేసుల్లోనూ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు తాజాగా కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రవిని మొదట అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో అతడిని ఐదు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే పలువురు సినీ నిర్మాతలు రవిపై ఫిర్యాదు చేయడంతో మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషనల్ వ్యవహారంలోనూ రవిపై కేసు నమోదైంది.

రెండో రోజు కస్టడీలో..

ఐదు రోజుల పోలీసు కస్టడీలో భాగంగా, రెండో రోజు రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ పైరసీ కార్యకలాపాలకు ఎవరు సహకరించారు, అతడి వెనుక ఎవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా, లేదా అతనే ఈ వ్యవహారాన్ని మొత్తం నడిపాడా వంటి కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో అతడికి సాంకేతిక సహకారం అందించిన వ్యక్తుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. మిగతా కేసుల్లోనూ త్వరలో అరెస్టు చేసి, ఈ మొత్తం పైరసీ నెట్‌వర్క్‌ను ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు. తొలి రోజు కస్టడీలో ఆదాయం, నెట్‌వర్క్ సోర్స్ లాంటి సాంకేతిక విషయాలపై వివరాలు రాబట్టిన విషయం తెలిసిందే.

Next Story