సైబర్ బ్లాక్‌ మెయిలింగ్.. ధైర్యంగా ఫిర్యాదు చేయండి : సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్

by Ramesh Naini |

ప్రతి మహిళా ఆన్‌లైన్‌లో సురక్షితంగా, ధైర్యంగా ఉండాలని, సైబర్ బ్లాక్ మెయిలింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ తెలిపారు.

సైబర్ బ్లాక్‌ మెయిలింగ్.. ధైర్యంగా ఫిర్యాదు చేయండి : సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి మహిళా ఆన్‌లైన్‌లో సురక్షితంగా, ధైర్యంగా ఉండాలని, సైబర్ బ్లాక్ మెయిలింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ తెలిపారు. మహిళ దినోత్సవం సందర్భంగా సైబర్ బ్లాక్ మెయిలింగ్ పై అవగాహన కలిగిస్తూ ఆదివారం వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, డబ్బులు అడిగితే పంపవద్దని సూచించారు. ఇలాంటి బెదిరింపులు వచ్చిన సమయంలో భయాన్ని వీడి , ధైర్యంగా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయాలని కోరారు.

ఒకసారి డబ్బు పంపితే వారు పదే పదే బ్లాక్‌మెయిల్ చేస్తూనే ఉంటారని, ఏదైనా సైబర్ బెదిరింపు లేదా స్పామ్ కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాని సూచించారు. సైబర్ నేరాలు మౌనం సంకోచం చెందవద్దని, అవగాహనతో పరిస్థితిని మార్చవచ్చని, ప్రతి మహిళా ఆన్‌లైన్‌లో సురక్షితంగా, ధైర్యంగా ఉండాలని ఆశిస్తున్నట్లు డీజీ తెలిపారు.

Next Story