Cyber: బీ అలర్ట్..! ఆర్మీ అధికారులమంటూ వాట్సాప్ కాల్.. వీసీ సజ్జనార్ ట్వీట్

by Ramesh Goud |
Cyber: బీ అలర్ట్..! ఆర్మీ అధికారులమంటూ వాట్సాప్ కాల్.. వీసీ సజ్జనార్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్మీ అధికారులమంటూ వాట్సాప్ కాల్స్ వస్తున్నాయని, తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఫేక్ కాల్స్ ఎక్కువగా వస్తు్న్నాయని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సైబర్ తరహా నేరాలపై సోషల్ మీడియాలో ప్రజలకు అవగాహాన కల్పించే ఆయన.. మరో కొత్త తరహా సైబర్ మోసం గురించి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఇందులో ఆర్మీ అధికారుల‌మంటూ వాట్సాప్ కాల్స్ వస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తనకు తెలిసిన ఒకరికి 7015591204 నుంచి వాట్సాప్ కాల్ చేసి ఇండియ‌న్ ఆర్మీలో మేజ‌ర్ ర్యాంక్ అధికారినంటూ ఓ అజ్ఞాత‌వ్యక్తి ప‌రిచ‌యం చేసుకున్నాడని తెలిపారు. ఆ వ్యక్తి క్రెడిట్ కార్డు వివ‌రాలు చెప్పాలంటూ అడిగారని, ఆ వ్యక్తిని సులువుగా న‌మ్మెందుకు ప్రధాని న‌రేంద్ర మోదీతో ఆర్మీ అధికారులు దిగిన ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్నాడని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటి వాట్సాప్ ఫోన్ కాల్స్ ఎక్కువ‌గా వ‌స్తున్నాయని చెబుతూ.. మోసపూరిత కాల్స్ కి స్పందించవద్దని ప్రజలకు అవగాహాన కలిగేలా ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed