- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైబర్ జాగృతా దివస్ నిర్వహణ
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ)

సైబర్ జాగృతా దివస్ నిర్వహణ
డిజిటల్ అరెస్ట్ మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా 577 అవగాహన కార్యక్రమాలు
దిశ, తెలంగాణ బ్యూరో
దిశ, తెలంగాణ బ్యూరో: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) సైబర్ జాగృతా దివాస్ 2025 ప్రారంభించినట్లు డీజీ శిఖా గోయల్ బుధవారం ప్రకటనలో తెలిపారు. బిజినెస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, ఐడెంటిటీ థెఫ్ట్, లోన్ మోసాలు , ప్రకటనల మోసాలు ఆన్‌లైన్ భద్రతలపై అవగాహన కార్య్రక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఫోన్ కాల్, వీడియో కాల్, స్కైప్ కాల్‌ల ద్వారా విచారణను ఏ పోలీసు అధికారి లేదా చట్టాన్ని అమలు చేసే సంస్థ దర్యాప్తు చేయదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా577 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సైబర్ నేరానికి గురైన వెంటనే 1930కి కాల్ చేసి పిర్యాదు చేయాలని సూచించారు.






