- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీడబ్ల్యూసీ సమావేశం వాయిదా.. నేడు ఛత్తీస్‌గఢ్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ (Telangana)లో నిర్మించ తలపెట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టు (Sammakka Sagar Project)కు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్యక్షతన నిర్వహించే సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సమావేశం వాయిదా పడింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో నిర్మించ తలపెట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టు (Sammakka Sagar Project)కు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్యక్షతన నిర్వహించే సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు అందుకు సంబంధించి సంబంధిత మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులలో సెప్టెంబర్ 23న ఉదయం 11:00 గంటలకు సభ్యుడు డబ్ల్యూపీ అండ్ పీ ఛాంబర్, సీడబ్ల్యూసీ కార్యాలయం న్యూఢిల్లీలో జరగాల్సిన సమావేశం కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడిందని పేర్కొన్నారు. తిరిగి అదే భేటీని సెప్టెంబర్ 25న ఉదయం 11 నిర్వహిస్తామని, సమావేశం జరిగే స్థలంలో ఎటువంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. ఈ మేరకు ఐఎంవో ఆశిష్ బెనర్జీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఛత్తీస్‌గఢ్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాగా, సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) ప్రాజెక్టుకు సంబంధించిన నిరభ్యంతర పత్రం (NOC)పై చర్చించేందుకు రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy)కి ఛత్తీస్‌గఢ్ సీఎంవో నుంచి కబురు అందింది. అయితే, వాసత్వానికి ఈ నెల 19న ఛత్తీస్‌గఢ్ సీఎంను కలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్‌మెంట్ కోరగా.. 22న ఖరారు చేసినట్లు సమాచారం అందింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి (Vishnu Dev Sai)తో రాయ్‌పూర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు.






