- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఢిల్లీలో సీడబ్ల్యూసీ మీటింగ్.. హస్తినకు మరోసారి సీఎం రేవంత్
కాంగ్రెస్ ఓబీసీ జాతీయ సలహా మండలి భేటీ జనవరి మూడవ వారంలో హైదరాబాద్ వేదికగా జరగనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఓబీసీ జాతీయ సలహా మండలి భేటీ జనవరి మూడవ వారంలో హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ సమావేశానికి లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. అందుకోసం చర్చించేందుకు ఈనెల 27న ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల అనంతరం కాంగ్రెస్ ఓబీసీ జాతీయ సలహా మండలి సమావేశమై తేదీని ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో శిక్షణ తరగతులు, ఓబీసీ జాతీయ సలహా మండలి ఎజెండాపై చర్చించేందుకు హాజరుకావాలని ఓబీసీ జాతీయ సలహా మండలి సభ్యులు మాజీ ఎంపీ వి.హనుమంతరావుకు ఆహ్వానం అందినట్లు పార్టీ వర్గాలు వెల్లడించారు.
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
ఈనెల 27న ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సమావేశం అనంతరం ఆయన రాష్ట్రంలోని పెండింగ్ అంశాలపై సంబంధిత శాఖల కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈనెల 28న రాత్రి తిరిగి ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారని, ఈనెల 29న జరిగే అసెంబ్లీ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.






