- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ను సందర్శించిన నగర్ సీపీ సీవీ ఆనంద్..
నేటితో తమ శాఖలకు చెందిన విభాగాలను హెల్త్ డిపార్టుమెంటు కు అప్పజెప్పినట్లు సీపీ సీవీ ఆనంద్ అన్నారు.

దిశ, కార్వాన్ : నేటితో తమ శాఖలకు చెందిన విభాగాలను హెల్త్ డిపార్టుమెంటు కు అప్పజెప్పినట్లు సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్న నేపథ్యంలో హార్స్ షెడ్డు ను తాత్కాలికంగా తరలించినట్లు తెలిపారు. ప్రభుత్వం 55 కోట్ల రూపాయలతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మించాలని నిర్ణయించిందన్నారు. ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరలో జరుగనున్న నేపథ్యంలో తమ పోలీస్ శాఖకు చెందిన అన్ని బ్లాక్స్ ను తరలిస్తున్నామన్నారు.
అందులో భాగంగానే చాలా సంవత్సరాలుగా ఉన్న హార్స్ గ్రౌండ్ ను తాత్కాలికంగా తరలించినట్లు తెలిపారు. అంతే కాకుండా తమ శాఖకు చెందిన అన్ని విభాగాలను తరలించి గోషామహల్ గ్రౌండ్ ను వైద్య శాఖకు అప్పగించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఉస్మానియా నిర్మాణానికి 11ఎకరాలు కేటాయించారని,ఇందులో 7 జోన్లకు చెందిన పలు కాంప్లెక్స్ లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ట్రైనింగ్ లో నేర్చుకున్న మహిళా పోలీసుల సెల్ఫ్ డిఫెన్స్ ట్రిక్స్ ను సీపీ ముందు ప్రదర్శించారు. మహిళలు ప్రొటెస్ట్ చేసినప్పుడు వారిని సురక్షితంగా తరలించడానికి స్వీప్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్ ను తయారు చేసినట్లు తెలిపారు. మొదటి టీమ్ లో 35 మంది మహిళ పోలీసులతో యాక్షన్ టీం ను సిద్ధం చేసినట్లు తెలిపారు.






