- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర డీజీపీగా CV ఆనంద్ నియామకం: సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీ
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ సీఎం రేవంత్ రెడ్డిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర నూతన పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP)గా సీనియర్ ఐపీఎస్ అధికారి CV ఆనంద్ నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం ఆయన హైదరాబాద్‌లోని స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర పోలీస్ బాస్‌గా బాధ్యతలు అప్పగించినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న CV ఆనంద్‌కు సీఎం ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ పని చేయాలని, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఆనంద్ చేసిన సేవలను ఈ సందర్భంగా వారు ఇరువురు గుర్తుచేసుకున్నారు.
కాగా, ప్రస్తుత డీజీపీ బి.శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ మే 1న అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారమే ఉత్తర్వులు జారీ చేశారు.






