- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణను కమ్మేసిన క్యుములోనింబస్ మేఘాలు.. ఎల్లో అలర్ట్ జారీ
ఇటీవల బంగాళఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు, వాయుగుండాలతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల బంగాళఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు, వాయుగుండాలతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసాయి. ఈ వార్షాల వల్ల వచ్చిన వరదల నుంచి ఇప్పుడిప్పుడే తెరుకుంటున్న ప్రజలకు మరో అలర్ట్ జారీ అయింది. శనివారం రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని క్యూములోనింబస్ మేఘాలు కమ్మెశాయి. దీంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే వాతావరణం చల్లగా మారిపోయింది. దీనికి తోడు కర్ణాటక మీదరుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటడంతో పలు వికారాబాద్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
క్యూములోనింబస్ మేఘాలు రాష్ట్రం మొత్తం వ్యాపించి ఉండటంతో పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తుంది. దీంతో ఈ రోజు రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉన్నట్లుండి కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో అప్రమత్తం అయిన అధికారులు.. జీహెచ్ఎంసీ, హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాయి.






