- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ఇంటర్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైనా అనుమతివ్వండి: సీఎస్
రాష్ట్రంలో జరగనున్న ఇంటర్, పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు కూడా అనుమతినిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరగనున్న ఇంటర్, పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు కూడా అనుమతినిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పరీక్షల నిర్వహణపై మంగళవారం రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ కె.రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య , పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ లు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎస్ రామకృష్ణా రావు మాట్లాడుతూ నేటి నుండి ఇంటర్ పరీక్షలు, మార్చి 14 నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయని, ఈ పరీక్షల నిర్వహణలో ఏవిధమైన అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని , గతంలో ఉన్న వివాదాస్పద పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో కనీస సౌకర్యాలైన తాగునీరు, విద్యుత్, టాయిలెట్ ల సౌకర్యాలు కల్పించడంతో పాటు సిసి టీవీ లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ కేంద్రం లో ఒక ఏఎన్ఎం , ఫస్ట్ఎయిడ్ కిట్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చొని పరీక్ష రాయకూడదని అన్ని కేంద్రాలలో బెంచీలు ఏర్పాటు చేయాలని అన్నారు.
పరీక్షల నిర్వహణలో పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యా శాఖ అధికారులు కాకుండా ఇతర శాఖల అధికారులతో సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్ లు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను అనుమతించడం లేదని కేవలం పరీక్ష కేంద్రం ఛీప్ సూపరింటెండెంట్ కు మాత్రమే ఎమర్జెన్సీ పరిస్థితులలో ఉపయోగించడానికి సెల్ ఫోన్ ను అనుమతిస్తున్నట్టు తెలిపారు. ప్రతీ కేంద్రం వద్ద మొదటి సారిగా క్లోక్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ పరీక్ష ప్రశ్న పత్రానికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్, సీరియల్ నెంబర్ ఉంటుందని పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందుగా మాత్రమే ప్రశ్నా పత్రాలను ఓపెన్ చేయాలని స్పష్టం చేసారు. ఈసారి మొదటి సారిగా విద్యార్థుల హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా పంపడమే కాకుండా వెబ్‌సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించామని వెల్లడించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్లను ఆదేశించారు.






