CS Review: రాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సమీక్ష

by Prasad Jukanti |

రాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సమీక్ష నిర్వహించారు.

CS Review: రాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సమీక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్ లో పర్యటించబోతున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి (CS Shanti kumari) అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై అటవీ, జీహెచ్ఎంసీ, పోలీస్, ఆర్ అండ్ బీ, ఎంఏయూడీ, ఇంధన శాఖ అధికారులకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షలో డీజీపీ జితేందర్, హోం స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ అండ్ బీ వికాస్ రాజ్, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, జీఏడీ సెక్రటరీ రఘునందన్ రావు, స్పెషల్ కమిషనర్, ఐ అండ్ పీఆర్ హరీశ్, ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story