పలు అభివ్రుద్ది కార్యక్రమాలపై సీఎస్ సమీక్షా సమావేశం

by Muthe.Rajitha |

రాష్ట్రంలో 16 ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం ప్రారంభమైందని, మరో ఆరు భవనాల నిర్మాణాలు వారం రోజుల్లో ప్రారంభమవుతాయని, సెప్టెంబర్ చివరికల్లా పూర్తవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.

పలు అభివ్రుద్ది కార్యక్రమాలపై సీఎస్ సమీక్షా సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 16 ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం ప్రారంభమైందని, మరో ఆరు భవనాల నిర్మాణాలు వారం రోజుల్లో ప్రారంభమవుతాయని, సెప్టెంబర్ చివరికల్లా పూర్తవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. బుధవారం సచివాలయంలో పలు అభివ్రుద్ది అంశాలపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైకోర్టు భవనాలు, తెలంగాణ భవన్‌, ఉస్మానియా ఆస్పత్రి, ప్రాంతీయ రింగ్‌రోడ్డు, ఇందిరా మహిళా శక్తి భవనాలు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ తదితర అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి భవనాల నిర్మాణం, అకడమిక్ బ్లాక్‌లు, రెసిడెన్షియల్ జోన్‌ల ఏర్పాటు ప్రణాళికలపై చర్చించారు. ఆసుపత్రి ప్రాంగణం పరిసరాలలోని పెట్రోల్ బంక్‌లు తొలగించేందుకు రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీసు శాఖలతో సంయుక్త తనిఖీ చేయాలని హైదరాబాద్ కలెక్టర్‌ను ఆదేశించారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ కు సంబంధించి పరిపాలన, అకడమిక్ స్ట్రక్చర్ తదితర అంశాలపై విధివిధానాలను రూపొందించాలని విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించారు. తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ (టీఈడబ్ల్యూఐడీసీ) ఇంజినీరింగ్‌ విభాగాన్ని బలోపేతం చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ భవన్ నిర్మాణం, ప్రాంతీయ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ స్థితిగతులపై చర్చించారు. రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్ రాజు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదరర్శి క్రిస్టినా జోంగ్తు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Next Story