అరవింద్ కుమార్‌పై చర్యలకు అనుమతి కోరుతూ డీవోపిటీకి సీఎస్‌ లేఖ

by velandi.Saikiran |

ఫార్ములా ఈ కేసులో నిందితుడిగా పేర్కోన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ పై చర్యలకు అనుమతి కోరుతూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్

అరవింద్ కుమార్‌పై చర్యలకు అనుమతి కోరుతూ డీవోపిటీకి  సీఎస్‌ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ కేసులో నిందితుడిగా పేర్కోన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ పై చర్యలకు అనుమతి కోరుతూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (డివోపిటీ) ఇండియన్ గవర్నమెంట్ ఏజన్సీ కి ఛీప్​ సెక్రటరీ రామకృష్ణరావు లేఖ రాశారు. ఈ కార్ రేస్ కేసులో యాంటి కరప్షన్ బ్యూరో(ఏసీబీ) ఇచ్చిన నివేదిక పై చర్యలు చెపట్టేందుకు సీఎస్ డివోపిటికి లేఖ రాశారు. డివోపిటి అనుమితి ఇచ్చిన నేపధ్యంలో సీఎస్ ఏసీబీకి ఆదేశాలు జారీ చేయనున్నారు.

కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కోన్న మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ కూడా అనుమితిచ్చారు. ఫార్ములా ఈ కార్ కేసులో ఛార్జ్‌షిట్ దాఖలు చేసేందుకు ఏసీబీ సన్నధంగా ఉన్నట్లు తెలుస్తుంది. కేసులో ఏ1గా పేర్కోన్న కేటీఆర్‌ను, ఏ2గా పేర్కోన్న అరవింద్ కుమార్‌ను ఏసీబీ అధికారులు రెండు సార్లు విచారించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఇద్దరిని ఓకే వేధిక పై విచారిస్తారని భావించిన ముందుకు పడలేదు. కేటీఆర్ , అరవింద్ కుమార్ అరెస్ట్ జరుగుతుందని ఉహగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్‌లో ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టబోతుందనే అంశం ఆసక్తిగా మారింది.

Next Story