- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం నివేదికపై సీఎస్ కీలక సమావేశం
కాళేశ్వరం నివేదిక(Kaleshwaram Report)పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(CS Ramakrishna Rao) సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం నివేదిక(Kaleshwaram Report)పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(CS Ramakrishna Rao) సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఇటీవలే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్(PC Ghosh) తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసిన విషయం తెలిసిందే. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ నివేదికను అధ్యయనం చేయడానికి ఉన్నతాధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసారు. ఈ కమిటీ సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో నీటిపారుదల శాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్నారు.
అయితే రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం(Telangana Cabinet Meeting) అయ్యి కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఓ నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో సీఎస్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. నివేదికపై రేపు సీఎం రేవంత్ రెడ్డికి తమ రిపోర్ట్ అందించనున్నారు.
Next Story






