సచివాలయంలో జగ్గారెడ్డి సమావేశం... సీరియస్ అయిన సీఎస్

by Muthe.Rajitha |   (  Updated:2025-08-19 15:04:16  IST  )

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేడు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

సచివాలయంలో జగ్గారెడ్డి సమావేశం... సీరియస్ అయిన సీఎస్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేడు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ అధికారులతో సెక్రటేరియట్ లో జగ్గారెడ్డి ఏర్పాటు చేసిన సమీక్షపై సీఎస్ రామకృష్ణా రావు సీరియస్ అయినట్టు సమాచారం. ఎమ్మెల్యే కాకపోయినా ఏ పదవీ లేకపోయినా ఏ అధికారంతో ప్రభుత్వ అధికారులతో సెక్రెటేరియట్ లో మీటింగ్ నిర్వహిస్తారని జోరుగా చర్చ నడుస్తోంది.

మిషన్ భగీరథ నీటి సరఫరాపై అధికారులకు ఆదేశాలు ఇవ్వడంపట్ల, సీఎం నుంచి రూ.200 కోట్ల నిధులు తెస్తాననడం పట్ల ఏ అధికారం ఉందని అదేశాలు ఇస్తాడు అంటూ సచివాలయ ఉద్యోగులు అవాక్కయ్యారు. కాగా ఈ సమావేశానికి ఎవరి అనుమతి తో వెళ్లారని కలెక్టర్ కూడా అరా తీసినట్లు సమాచారం. మరోవైపు జగ్గారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరుతున్నారు అధికారులు.

Next Story