భారీ వర్షాలపై సీఎస్ అలర్ట్! విద్యా సంస్థలకు సెలవులపై కీలక ఆదేశాలు

by Geesa Chandu |   (  Updated:2024-08-31 18:58:57  IST  )

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అత్యవసర మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు.

భారీ వర్షాలపై సీఎస్ అలర్ట్! విద్యా సంస్థలకు సెలవులపై కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాలలో.. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. దీని కొరకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని అన్నారు.

విద్యా సంస్థలకు సెలవుల విషయంలో.. పరిస్థితిని బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని సూచించారు సీఎస్ శాంతి కుమారి. దీంతో పాటు జిల్లాలలోని చెరువులు, డ్యాములు, కుంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రాజెక్టుల వద్ద వరద ఉదృతిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలని, జిల్లాల్లోని పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు హైదరాబాద్ లోని హెడ్ క్వార్టర్ కు తెలియపరచాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.

Next Story