క్రిప్టో కరెన్సీలో మోసం.. చైనా వ్యక్తి నుంచి రిఫండ్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-25 17:11:14  IST  )

సైబర్ సెక్యూరిటి నమోదైన ఫిర్యాదులో విదేశాల నుంచి రిఫండ్ రావడం రావడం జరిగిందని సైబర్ సెక్యరిటిలో ఇదే మొదటిసారి అని సైబర్ సెక్యూరిటి బ్యూరో డీజీ శిఖా గోయల్ తెలిపారు.

క్రిప్టో కరెన్సీలో మోసం.. చైనా వ్యక్తి నుంచి రిఫండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సైబర్ సెక్యూరిటి నమోదైన ఫిర్యాదులో విదేశాల నుంచి రిఫండ్ రావడం రావడం జరిగిందని సైబర్ సెక్యరిటిలో ఇదే మొదటిసారి అని సైబర్ సెక్యూరిటి బ్యూరో డీజీ శిఖా గోయల్ తెలిపారు. ఈ కేసుకు సబంధించిన వివరాలు డీజీ సోమవారం ప్రకటనలో వెల్లడించారు. రామగుండం సీసీపిఎస్ లో జూన్ 12వ తేదిన నమోదైన కేసులో చైనా నుంచి రూ. 2.38లక్షల రిఫండ్ బాధితుడికి అందజేయడం జరిగిందని తెలిపారు. మంచిర్యాలకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రెండు సంవత్సరాల క్రితం క్రియేట్ చేసుకున్న మాట్రిమోని ద్వారా 2025 జనవరి నెలలో నందితా రెడ్డి అనే మహిళ పరిచయం అయింది. క్రిప్టో కరెన్సీలో నిపుణురాలినని చెప్పి అతనితో పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. మొదట చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టించి విత్ డ్రా చేసుకునేలా నమ్మకం కలిగించింది.

తరువాత క్రమంలో రూ.40లక్షల పెట్టుబడి పెట్టించి రూ.2కోట్ల లాభాలు చూపిచడం జరిగింది. విత్ డ్రా టాక్స్, కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ , మొదలగు ఫీజ్ పేర్లతో మరో రూ.6లక్షల వసూలు చేశారు. బాధితుడు మొత్తంగా రూ.87.58లక్షల నష్టపోయినట్లు సైబర్ క్రైమ్ లో పిర్యాదు చేశాడని డీజీ తెలిపారు. క్రిప్టో సైబర్ ఇన్వెస్టిగేషన్ సహయంతో చైనాకు చెందిన జియాంగ్ చువాన్షువాన్ అనే వ్యక్తికి చెందిన ఓకేకే ఎక్సెంజ్ వాలెట్ కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఎక్సెంజ్ కి నోటిసులు జారి ఫ్రీజ్ చేయించినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలతో రాష్ట్ర సైబర్ సెక్యూరిటి బ్యూరో కి రిఫండ్ వచ్చినట్లు తెలిపారు. ఓ విదేశి పౌరుడి వాలెట్ నుంచి అంతర్జాతీయ క్రిప్టో ఎక్సెంజ్ ద్వారా భారతీయ భాధితుడి నిధులు తిరిగి రావడం అరుదైన విషయం అని పేర్కోన్నారు. ఈ కేసులో కృషి చేసిన ఇన్వెస్టీగేషన్ ఆఫీసర్ కృష్ణమూర్తి, క్రిప్టో ఇన్వెస్టిగేషన్ , డీఎస్పీ రంగారెడ్డి బృందాని డీజీ అభినందించారు.

Next Story