- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేములవాడలో భక్తుల రద్దీ.. బ్లాక్‌లో దర్శన టికెట్లు.. ఏడుగురిపై కేసులు నమోదు
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరకు ముందు వేములవాడ రాజన్నకు కోడె మొక్కులు, వివిధ ఆర్జిత సేవల మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా ఉండటం, వరుస సెలవులు రావడం కూడా భక్తుల రద్దీకి కారణమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు.
ఈ నేపథ్యంలో కొందరు దళారులు బ్రేక్ దర్శనాలు చేయిస్తామని చెప్పి భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ, బ్లాక్‌లో దర్శన టికెట్లు విక్రయిస్తున్నట్టు సమాచారం అందింది. అప్రమత్తమైన వేములవాడ టౌన్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహించారు. బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న ఏడుగురిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. దేవాలయ పరిసరాల్లో బ్లాక్ టికెట్ల విక్రయం సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. భక్తులు దర్శనాలు, ఆర్జిత సేవల టికెట్లను దేవస్థానం సూచించిన అధికారిక కౌంటర్లలోనే కొనుగోలు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.






