Eatala: జనసంద్రమైన ఈటల నివాసం.. బారులు తీరిన జనం.. ఎందుకొచ్చారు?

by Ramesh N |
Eatala: జనసంద్రమైన ఈటల నివాసం.. బారులు తీరిన జనం.. ఎందుకొచ్చారు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ (Parliament) సమావేశాలు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Election 2025) ప్రచారంలో పాల్గొన్న (MP Eatala Rajender) ఎంపీ ఈటల రాజేందర్ జనవరి నుంచి ఫిబ్రవరి 8 వరకు దేశ రాజధానిలోనే ఉన్నారు. రేపు ఉదయం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఈటల రాజేందర్‌ని కలవడానికి (Telangana BJP) బీజేపీ శ్రేణులు, అభిమానులు, సామాన్య ప్రజలు షామీర్ పేట నివాసానికి వచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఈటలకు పార్టీ శ్రేణులు శాలువలు కప్పి సత్కరించారు.

దాదాపు వెయ్యి మందికి పైగా రావడంతో ఈటల రాజేందర్ ఇళ్లు జనాలతో కిటకిటలాడింది. అయినా అంతమందిని కలిసి వారితో ఓపికగా మాట్లాడారు. ఇక అందరికీ ఈటల బీజేపీ కండువాలు కప్పారు. వారికి అవసరమైన పనులు చేసి పెట్టారు. దీంతో వచ్చినవాళ్లు దట్ ఈజ్ ఈటల రాజేందర్ అని కొనియాడారు. ఈ మధ్య కాలంలో (Congress) కాంగ్రెస్ మంత్రులు ఇతర ఏ రాజకీయ నాయకుడు దగ్గర ఇంత మంది జనం చూడలేదని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు. కాగా, ఢిల్లీ ఎన్నికల్లో ఈటల ప్రచారం చేసిన ఘొండా అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అజయ్ మహావర్ భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed