- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress vs BRS: కృష్ణా వాటార్ వాటాపై బీఆర్ఎస్ కాంగ్రెస్ క్రెడిట్ వార్!
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యూనల్ నిర్ణయంపై తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నీటి అంశం హాట్ టాపిక్ గా మారింది. కృష్ణాజలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయపరమైన వాటా విషయంలో అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్ 3 పైనా తొలుత వాదనలు వింటామని జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే వ్యవహారంలో ఇప్పుడు కాంగ్రెస్ (Congress) వర్సెస్ బీఆర్ఎస్ (BRS) మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ (Brijesh kumar Tribunal) తీసుకున్న నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రప్రభుత్వం ప్రయత్నతాలు, కృషి ఉందని అధికార పక్షం చెబుతోంది. ఇది తెలంగాణ విజయం అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వడం రాజకీయాన్ని మరింత రక్తికట్టిస్తోంది.
ఆ క్రెటిట్ కేసీఆర్ దే: బీఆర్ఎస్
కృష్ణా జలాల (Krishna water) విషయంలో బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయం వెనుక ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన కృషి ఉందని ఇది ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమేననని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) అన్నారు. 'బీడుబడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని ఉద్యమ నేత కేసీఆర్ గారు చేసిన కృషి ఫలించింది. కృష్ణా నీళ్లలో మా వాటా మాకే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పోరాట ఫలాలు అందుకోవడం ఎంతో దూరంలో లేదు' అంటూ కవిత ట్వీట్ చేయగా.. కేసీఆర్ కొట్లాడి సాధించిన విజయాన్ని సైతం తమ ఘనతగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీ భావదారిద్య్రానికి నిదర్శనం అని హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ మేరకు ఒక ప్రటన విడుదల చేసిన హరీశ్ రావు(Harish Rao).. కృష్ణా నదీ జలాల కేటాయింపులపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు పటిష్టమైన వాదనలు వినిపించేలా నిష్ణాతులైన న్యాయవాదులను ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నదీ జలాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొన్నారు.






