- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CPIM: చిల్పకుంట్లలో మళ్లీ ఎగసిన సీపీఎం జెండా
చిల్పకుంట్ల గ్రామం మరోసారి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) కంచుకోటగా నిలిచింది.

దిశ, డైనమిక్ బ్యూరో: చిల్పకుంట్ల గ్రామం మరోసారి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) కంచుకోటగా నిలిచింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కమ్యూనిస్టులను ఒంటరిగా ఎదుర్కోలేక సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ)తో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేసినప్పటికీ, ప్రజలు అభివృద్ధి పక్షాన నిలబడి సీపీఎం మద్దతు అభ్యర్థి అంజపల్లి నర్సమ్మ-లక్ష్మయ్యలను ఘనంగా గెలిపించారు. రాష్ట్ర స్థాయిలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఈ గ్రామంలో మాత్రం సీపీఎం బలాన్ని బద్దలు కొట్టాలనే లక్ష్యంతో చేతులు కలిపాయి. స్థానిక ఎమ్మెల్యే అండతో డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు దిగినా, వాటిని ప్రజలు తిరస్కరించారు. పేదల పక్షాన నిలబడి నిరంతరం అభివృద్ధికి కృషి చేసిన సీపీఎంపై ప్రజలు మరోసారి తమ నమ్మకాన్ని చాటారు.
చిల్పకుంట్లలో గత చరిత్రను పరిశీలిస్తే, సర్పంచ్ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి కేవలం నాలుగు సార్లు మాత్రమే సీపీఎం ఓటమిని చవిచూడగా, మిగతా అన్ని ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసింది. అలాగే ఎంపీటీసీ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సీపీఎం ఓడిపోలేదంటే ఈ గ్రామంలో పార్టీకి ఉన్న బలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్-బీఆర్‌ఎస్-సీపీఐఎంఎల్ కూటమి విఫలమై, సీపీఎం విజయమే నమోదు అయింది.
ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు సీపీఎంను నేరుగా ఎదుర్కోలేమని గ్రహించి, స్నేహాలు, బంధుత్వాలను అడ్డుపెట్టుకుని పార్టీకి చెందిన వార్డు మెంబర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉప సర్పంచ్ పదవి ఆశ చూపుతూ వర్గాలుగా చీల్చే కుట్రలు జరుగుతున్నప్పటికీ, క్రమశిక్షణకు మారుపేరైన మార్క్సిస్టులు వాటిని తిప్పికొట్టారు. ఉప సర్పంచ్ ఎన్నికను విజయవంతంగా పూర్తిచేసిన అనంతరం, డిసెంబర్ 22న సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులందరూ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆపదలో ఆదుకునే నాయకత్వం, పేదల అభివృద్ధిపై అంకితభావం ఉన్న పార్టీగా సీపీఎం కొనసాగుతున్నందుకే చిల్పకుంట్ల ఇప్పటికీ మార్క్సిస్టుల కంచుకోటగా నిలుస్తోందని గ్రామ ప్రజలు స్పష్టం చేస్తున్నారు.






