CPM: గాదె ఇన్నయ్య అరెస్ట్ అప్రజాస్వామికం: సీపీఎం

by Ramesh Naini |

సామాజిక కార్యకర్త, అనాధాశ్రమాన్ని నిర్వహిస్తున్న గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేయడం పట్ల సీపీఐ(ఎం) తెలంగాణ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది

CPM: గాదె ఇన్నయ్య అరెస్ట్ అప్రజాస్వామికం: సీపీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సామాజిక కార్యకర్త, అనాధాశ్రమాన్ని నిర్వహిస్తున్న గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేయడం పట్ల సీపీఐ(ఎం) తెలంగాణ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇన్నయ్య అరెస్ట్ అప్రజాస్వామికం అని CPI(M) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అంత్యక్రియలో పాల్గొని, అక్కడ జరిగిన సభలో మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారనే నెపంతో ఈ అరెస్టు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారని తెలిపారు. ఆపరేషన్‌ కగార్‌, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణులను వ్యతిరేకిస్తున్నవారిని, సామాజిక సమస్యలపై స్పందించే వ్యక్తులను అరెస్టులు చేయడం ప్రజాస్వామిక గొంతుకలను అణచి వేయడమేనని ఆరోపించారు. ఇన్నయ్య అరెస్టును అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ పై జరిగిన దాడిగా భావించి ప్రజాస్వామిక వాదులందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

Next Story