ఆయనకు మోడీ గులాం.. సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

భారతదేశానికి తలవంపులు తెచ్చేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) గులాంలా వ్యవహరిస్తున్నాడని సీపీఐ(CPI) జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) అన్నారు.

ఆయనకు మోడీ గులాం.. సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశానికి తలవంపులు తెచ్చేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) గులాంలా వ్యవహరిస్తున్నాడని సీపీఐ(CPI) జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) అన్నారు. ట్రంప్ ఒత్తిళ్లకు మోడీ తలొగ్గారని విమర్శించారు. భారతదేశానికి తలవంపులు చేసేలా మోడీ పాలన సాగుతోందని మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశం సంక్షోభంలో పడిందన్నారు. బ్యాంకులను లూటీ చేసి 28 మంది ఫారిన్‌లో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారని అన్నారు. వారిని దేశానికి తీసుకొచ్చే దమ్ము మోడీకి లేదని అన్నారు.

మరోవైపు భారత విద్యార్థులను అమెరికాలో ట్రంప్ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఏమాత్రం పట్టించుకోకుండా ట్రంప్‌నకు మోడీ గులాంలా వ్యహరిస్తున్నడని విమర్శించారు. పాడిచ్చేరి ప్రభుత్వం బీజేపీ అనుకూలంగా ఉన్నా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అక్కడ ముఖ్యమంత్రికి కనీసం క్లర్క్‌ను కూడా బదిలీ చేసే అధికారం లేదన్నారు. తమిళనాడు, కేరళలో గవర్నర్లు కేబినెట్ నిర్ణయాలను అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. తమ తాబేదార్ల ప్రభుత్వం ఉండాలి తప్ప ఇతరులు ఉండొద్దనే విధంగా కేంద్ర ప్రభుత్వ తీరు ఉందన్నారు. విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, ధరల అదుపుదల కోసం ఉధృతంగా పోరాటాలు చేయాలన్నారు.

Next Story