CPI Narayana: ఏపీ, తెలంగాణ జల వివాదానికి కారణం చంద్రబాబే.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.

CPI Narayana: ఏపీ, తెలంగాణ జల వివాదానికి కారణం చంద్రబాబే.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని సీపీఐ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. (AP CM Chandrababu Naidu) చంద్రబాబు ఓవర్ యాక్షన్ వల్లే బనకచర్ల వివాదాస్పదంగా మారిందని ఆరోపించారు. ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై సరైన క్లారిటీ ఇవ్వకుండా పోలవరం, బనకచర్లపై లింక్ పెట్టి మాట్లాడారని తెలిపారు. ఆయన మాట్లాడిన పద్ధతి చూస్తే.. సహజంగా తెలంగాణకు కోపం వస్తోందన్నారు. తర్వాత రేవంత్ రెడ్డి బనకచర్లపై ప్రశ్నిస్తే.. మూడో సారి చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారని తెలిపారు. మొత్తం నీళ్లు సముద్రంలోకి పోతున్నాయని, సముద్రంలోకి పోయే నీటిని ఎవరైనా వాడుకోవచ్చు కాదా అని చంద్రబాబు మాట్లాడినట్లు వివరించారు.

అయితే సముద్రంలోకి పోయే నీటిని వాడుకోవచ్చని, కానీ దానికి ముందు తెలంగాణతో చర్చించి ఉంటే బాగుండేదన్నారు. ముందే తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడి.. నీటి వాటాలను పంచాల్సి ఉండేదన్నారు. కానీ అవేవి చెప్పకుండా ఓవరాక్షన్ చేయడంతో సహజంగానే తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించిందన్నారు. ఏపీలో కరువు ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా.. ఈ బనకచర్లకు ఖర్చు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ముందు ఏపీలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత తెలంగాణతో చర్చించాకే బనకచర్ల కట్టుకోవాలన్నారు.

Next Story