- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమ్యూనిజం ఎక్కడ ఉందనే వారికి ఇదే రుజువు.. సీపీఐ కూనంనేని కీలక వ్యాఖ్యలు
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) వందేళ్ల ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలోని ఎస్ఆర్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్ మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాది మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) వందేళ్ల ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలోని ఎస్ఆర్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్ మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాది మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు వామపక్ష పార్టీల అగ్ర నాయకులు, సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారని వివరించారు. భారత్‌లో కమ్యూనిజం ఎక్కడ ఉన్నదనే వారికి ‘సీపీఐ ఖమ్మం బహిరంగ సభ’ ఒక రుజువుగా నిలువనుందన్నారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్ జర్నలిస్టులతో శనివారం కూనంనేని సాంబశివరావు ఇష్టాగోష్టిలో మాట్లాడారు. ఖమ్మం బహిరంగ సభకు ఏపీ, కేరళ, తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్నారని, ప్రజలు స్వచ్ఛందంగా రవాణా సౌకర్యాన్ని కల్పించుకుని వస్తున్నారని ఆయన తెలిపారు.
వేల మందితో ‘జనసేవాదళ్ కవాతు’
బహిరంగ సభకు ముందు పదివేల మందితో ‘జనసేవాదళ్ కవాతు’ను నిర్వహించనున్నామని, ఆ తర్వాత సభ జరుగుతుందని తెలిపారు. మరుసటి రోజు 19వ తేదీన జాతీయ సదస్సును నిర్వహిస్తామని, అలాగే ఈనెల 19, 20, 21న సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గం, కార్యవర్గ, సమితి సమావేశాలను నిర్వహించనున్నట్టు కూనంనేని వివరించారు. కమ్యూనిస్టు సిద్ధాంతానికి భిన్నంగా కాకుండా మారుతున్న కొత్త పద్ధతులు, వివిధ దేశాల పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ శ్రీలంక, నేపాల్ ఇలా పలు దేశాలలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాయని, చిన్నపాటి సమస్యలు వచ్చినా పరిష్కరించుకూంటూ ఐక్యంగా ముందుకు వెళ్తున్నారని ఆయన వివరించారు. భారతదేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులు, కగార్ ఆపరేషన్, కార్మిక హక్కులను కాలరాస్తూ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ ఇలాంటి సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిస్తే బాగుటుందని అందరూ కోరుకుంటున్నారని, కమ్యూనిస్టు పార్టీలలో ఐక్యత రావాలని చాలా మంది చెబుతున్నారని కూనంనేని సాంబశివ రావు తెలిపారు.






