- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జస్టిస్ గవాయ్‌పై దాడి.. సనాతన ధర్మానికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని రెచ్చగొట్టే వైఖరి: సీపీఐ(ఎం) తెలంగాణ కమిటీ
భారత న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై న్యాయవాది కిషోర్‌దాస్ చెప్పు విసిరి దాడి చేయడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: (Justice BR Gavai) జస్టిస్ గవాయ్‌పై దాడి దిగ్భ్రాంతికరం.. భారత న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై న్యాయవాది కిషోర్‌దాస్ చెప్పు విసిరి దాడి చేయడాన్ని (CPI(M)) సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ (CPM State Secretary John Wesley) అన్నారు. దాడికి పాల్పడిన న్యాయవాది కిషోర్ దాస్(Kishore Das)ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితున్ని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగానికి అనుగుణంగా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు తీర్పునివ్వడం, వ్యాఖ్యానాలు చేసే వైఖరి ఉంటుంది. కానీ మనువాద, మతోన్మాద, ఆధిపత్య ధోరణులకు, సనాతన ధర్మానికి, ఇతర మతాలకు అనుకూలమైన రీతిలో తీర్పులుండాలనే రెచ్చగొట్టే వైఖరి సరైంది కాదని అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న వైఖరి వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక శక్తులను అవమానించే ఘటన అని మండిపడ్డారు. కుల అసమానతలు, మతోన్మాద రాజకీయాలు, మూఢ విశ్వాసాన్ని పెంచి పోషించే విధంగా బీజేపీ, ఆర్‌ఎఎస్‌ఎస్ తన భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నదని ఆరోపించారు. గతంలో బీజేపీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో కూడా సిద్ధిపేట జిల్లాలో కొంత మంది ఆధిపత్య కులాల న్యాయవాదులు ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యానాలు చేశారని, గాంధీని హత్యచేసి హంతకులైన ఆర్‌ఎస్‌ఎస్‌ను ఈనాడు దేశ భక్తులుగా స్వాతంత్య్ర దినోత్సవం రోజే వారిని దేశ ప్రధానమంత్రే కీర్తించారని అన్నారు.
ఇలాంటి ఘటనలకు భయపడే ప్రసక్తి లేదని ప్రధాన న్యాయమూర్తి చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు. కుల, మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నీ, సామాజిక న్యాయం కోరే, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే శక్తులన్నీ ఐక్యంగా నిలబడి పోరాడాల్సిన అవసరం ఉన్నదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు కూడా ఇలాంటి దాడులను సంఘటితంగా వ్యతిరేకించాలని సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేస్తుందని ఆయన తెలిపారు.






