- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ సర్కార్ ఎదుట CPIM తెలంగాణ కొత్త బాస్ తొలి డిమాండ్
సూర్యాపేట(Suryapet) జిల్లాలో జరిగిన పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట(Suryapet) జిల్లాలో జరిగిన పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. భార్గవి అనే యువతి ప్రేమ వివాహం చేసుకున్నందుకు కక్షగట్టిన ఆమె సోదరులు కృష్ణ అనే యువకుడ్ని అతి కిరాతకంగా హత్య చేశారు. తాజాగా ఈ ఘటనపై సీపీఐఎం తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో జరిగిన కుల దురహంకార హత్యను సీపీఐఎం తెలంగాణ(CPIM Telangana) కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. గత ఐదు నెలల క్రితం దళితుడైన వడ్లకొండ కృష్ణ, బీసీ కులానికి చెందిన భార్గవి కులాంతర వివాహం(Intercaste Marriage) చేసుకున్నారు. దీంతో తమ కుటుంబ పరువు పోయిందనే నెపంతో భార్గవి కుటుంబ సభ్యులు కృష్ణను దారుణంగా హత్య చేశారు. ఈ హత్య చేసిన నిందితులపై గతంలోనూ అనేక కేసులు ఉన్నాయి. వీరిని అరెస్ట్‌తో సరిపెట్టకుండా, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవడంతో పాటు భార్గవికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
చట్టాలు ఎన్నొచ్చినా కులాంతర వివాహం చేసుకున్న వారిపై హత్యలు, దాడులు, బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, రక్షణ వ్యవస్థల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా కులాంతర వివాహాలు చేసుకునే వారి కోసం ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని సీపీఐఎం(CPIM)గా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే 45 కుల దురహంకార హత్యలు జరిగాయని గుర్తుచేశారు. కళారూపాలు, ఇతర ప్రసార సాధనాల ద్వారా ప్రజలను చైతన్య పర్చాలి, ఘటనలు జరిగిన వెంటనే నిర్ణీత కాల వ్యవధిలో విచారణ జరిపి వారికి భరోసా ఇవ్వాలని కోరారు.






