- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వం దిగి రాకపోతే RTC ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: సర్కార్‌కు CPIM హెచ్చరిక
మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో శనివారం, ఆదివారాల్లో రెండు రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో శనివారం, ఆదివారాల్లో రెండు రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. ఆర్టీ కార్మికుల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదన్నారు. ఇప్పటికే వరంగల్‌లో ఒక కార్మికుడు ఆత్మహత్యలకు పాల్పడి మరణించాడని, మరో ఇద్దరు కూడా అలాంటి చర్యలకే పూనుకున్నారని గుర్తుచచేశారు.రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు నిరసన తెలియజేస్తున్నా రాష్ట్రప్రభుత్వం చర్చల పేరుతో డిమాండ్లు పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కార్మికులకు మద్దతుగా జిల్లాల్లో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పెద్దపాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మికులు అడుగుతున్నారని తెలిపారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగాల భర్తీ, కార్మికుల బకాయిల చెల్లింపు, కార్మిక సంఘం ఎన్నికలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా రావలసిన సుమారు రు. 400 కోట్లతో పాటు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజ్ తదితర 32 డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నారని, వీటిని పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. న్యాయమైన కోర్కెలపై ఆందోళన చేస్తుంటే చర్చల పేరుతో కాలయాపన చేస్తూ, వాయిదాలు వేసే పద్దతుల్లో వ్యవహరించడం అనేది సరైంది కాదని, కార్మికులతో జరుగుతున్న చర్చలు సఫలం అయ్యేట్లుగా, వారి డిమాండ్లు పరిష్కరించేటట్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా, కార్మికుల పోరాటాలకు మద్దతుగా ప్రత్యక్ష కార్యాచరణకు సీపీఎం పూనుకుంటుందని హెచ్చరించారు. కార్మికులు హక్కులకోసం పోరాడాలే తప్ప, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఆత్మహత్యల ద్వారా ఈ ప్రభుత్వాన్ని స్థంభింపజేయాలనే ధోరణి కాకుండా, పోరాడి సాధించాలనే వైపు ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు.






