Prakash Karat: సీతారాం ఏచూరి లేని లోటును తీర్చాల్సిన బాధ్యత మనదే

by Gantepaka Srikanth |

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీపీఎం తెలంగాణ(CPIM Telangana) రాష్ట్ర నాలుగో మహాసభలు గ్రాండ్‌గా ప్రారంభం అయ్యాయి.

Prakash Karat: సీతారాం ఏచూరి లేని లోటును తీర్చాల్సిన బాధ్యత మనదే
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీపీఎం తెలంగాణ(CPIM Telangana) రాష్ట్ర నాలుగో మహాసభలు గ్రాండ్‌గా ప్రారంభం అయ్యాయి. ఈ సభలకు ఆ పార్టీ జాతీయ నేత నేత ప్రకాష్‌ కారత్(Prakash Karat) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి లేని లోటును తీర్చాల్సిన బాధ్యత నేతలపై ఉందని సూచించారు. మదురైలో జరిగే మహాసభలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ(BJP) ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశాన్ని ఒకే మతానికి పరిమితం చేయాలని చూశారని తెలిపారు. మళ్లీ నల్లచట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

లౌకికవాద శక్తులతో కలిసి బీజేపీ విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. అంతకుముందు బృందా కారత్ మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ హయాంలో పెట్టుబడిదారుల ఆస్తులు 400 రెట్లు పెరిగాయని ఆరోపించారు. కర్ణాటక, తెలంగాణలో ఉన్న ఇండియా కూటమి ప్రభుత్వాలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆమె అన్నారు.

Next Story