Jubilee Hills By-Election: కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తమ పార్టీ అభ్యర్ది నవీన్​యాదవ్‌కి మద్దతు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్​మహేష్​కుమార్​గౌడ్ సీపీఐ పార్టీని కోరారు.

Jubilee Hills By-Election: కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తమ పార్టీ అభ్యర్ది నవీన్​యాదవ్‌కి మద్దతు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్​మహేష్​కుమార్​గౌడ్ సీపీఐ పార్టీని కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయం మక్దుం భవన్‌లో ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కార్యదర్శి సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, జాతీయ నాయకులు కె. నారాయణలతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ప్రధానంగా జూబ్లీహిల్స్‌లో మద్దతు, బీసీబంద్​నిర్వహణ, మద్దతుపై వీరి మద్య చర్చ జరిగింది. అనంతరం మహేష్​కుమార్​గౌడ్​మాట్లాడుతూ కాంగ్రెస్ తరపున మిత్ర పక్షమైన సీపీఐ నేతలతో బీసీ జేఏసీ బంద్, జూబ్లీ హిల్స్ మద్దతుపై చర్చించామన్నారు. మిత్రపక్షాల ఐక్యతే మా బలమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సిపిఐ మద్దతుగా నిలించిందన్నారు. ఈ పరంపర భవిష్యత్ లోనూ కోసగతుందని మహేష్​కుమార్​గౌడ్ ఆకాంక్షించారు.

జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీ తో గెలవబోతున్నారని ఆయన చెప్పారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మహేష్​కుమార్​గౌడ్​జూబ్లీహిల్స్​లో తమ పార్టీ అభ్యర్ధి నవీన్​యాదవ్​కి మద్దతు అడిగారని, తాము కాంగ్రెస్​తో 2023 నుంచి పొత్తులో ఉన్నామన్నారు. ఈ రెండు సంవత్సారాల్లో మిత్రపక్షంగా ఉంటూనే అప్పుడప్పుడు నిర్మాణాత్మక సూచనలు ప్రభుత్వానికి చేస్తున్నామన్నారు. బీజేపీ ప్రమాదకర శక్తి గా మారిందని, బీఆర్ఎస్ కేవలం బీజేపీకి అనుబంధ సంస్థగా అయ్యే ప్రమాదం కనిపిస్తోందని సాంబశివరావు ఆరోపించారు. అందుకే రేవంత్​రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామన్నారు. నవీన్​యాదవ్​విజయం సాధిస్తారని, ట్రెండ్​కూడా మారిందన్నారు. నవీన్ యాదవ్​గెలవాల్సిన అవసరం ఉందని, ఇది శుభ సంకేతమన్నారు. ఇటు బీసీబంద్​కు మద్దతు ఇవ్వడంతో పాటు తాము పాల్గొంటామన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఈనెల 15న తమ అనుబంధ సంఘాలు రాస్తారోకోలు నిర్వహించాయని సాంబశివ రావు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, ఈటీ నరసింహ, కార్యదర్శి సభ్యులు కలవేణి శంకర్, పశ్య పద్మ, బాగం హేమంత్ రావు, బాల నరసింహ, విఎస్ బోస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story