గాజుల రామారంలో CPI రాష్ట్ర మహాసభలు

by Gantepaka Srikanth |

బ్యూరో: ఆగస్టు 19వ తేదీ నుండి నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గాజుల రామారంలో CPI రాష్ట్ర మహాసభలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆగస్టు 19వ తేదీ నుండి నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు బుధవారం షాపూర్​నగర్​ఏఐటీయూసీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని కూనంనేని సాంబశివరావు ఆ ప్రకటనలో తెలిపారు. ఎర్రజెండా పార్టీలు ఏకం కావాలల్సిన అవసరం ఉన్నదని కూనంనేని సాంబశివరావు అన్నారు. సమాజంలో కమ్యూనిస్టుల అవసరం ఉన్నదని, ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మతోన్మాద బీజేపీ కమ్యూనిస్టులపై రాక్షస నిరంకుశ పరిపాలన కొనసాగిస్తుందని వీటిని నిలువరించేందుకు ఎర్రజెండా వామపక్ష పార్టీలని ఒక తాటిపైకి వచ్చి ప్రజా పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

Next Story