- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నదీ జలాల వివాదంపై కేంద్రం కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నాం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాలు వివాద రహితంగా ఉన్న ప్రాజెక్టులను కట్టుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

- ఇప్పటికే ఏపీ, తెలంగాణలో నీళ్ల రాజకీయం పెరిగింది
- ఢిల్లీలో మీడియాతో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాలు వివాద రహితంగా ఉన్న ప్రాజెక్టులను కట్టుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని సీపీఐ స్వాగతిస్తోందన్నారు. రెండు రాష్ట్రాలు కూడా నీటి పంపిణీ ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి తమ పార్టీ సీపీఐ ఎప్పుడూ సానుకూలంగానే ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా నదీ జాలాల్లో రెండు రాష్ట్రాల నీటి వాటాలు తేలాకనే నీటి ప్రాజెక్టులపై ముందుకు వెళ్లాలని సూచించారు. రాయలసీమకు నీళ్లు అవసరం అని, అయితే ఇదే సమయంలో ఏపీ, తెలంగాణలో నీటి అంశాలను కొందరు రాజకీయం చేస్తున్నారని నారాయణ విమర్శించారు.
నీళ్లను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. బనకచర్ల గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలుత తెలంగాణ సీఎంతో మాట్లాడాల్సిందన్నారు. ఆయన ఆ పని చేయక పోవడం వల్లే విషయం ఢిల్లీ దాకా చేరిందని తెలిపారు. బనకచర్ల ప్రస్తుతం ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు ఏమీ కాదన్నారు. మొదట పెండింగ్ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆయన చంద్రబాబు నాయుడుకు సూచించారు. బనకచర్ల 80 వేల కోట్ల ప్రాజెక్టు కాదని, 2 లక్షల కోట్లు అవుతుందని చెప్పుకొచ్చారు. ముందుకు ఇరు రాష్ట్రాలు కూడా వివాద రహిత ప్రాజెక్టులు కట్టుకోవాలని నారాయణ స్పష్టం చేశారు. ఆ తర్వాత బనకచర్ల వంటి వాటి జోళికి వెళ్లండన్నారు. తెలంగాణకు సీఎం రేవంత్రెడ్డి అన్యాయం చేయలేని అన్నారు. ఇరు రాష్ట్రాల్లో గత పాలకులు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా తాజాగా బనకచర్ల అంశాన్ని తెర మీదికి తీసుకురావడం వల్ల ఉపయోగం లేదన్నారు.






