- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాలతో పని చేస్తున్న గవర్నర్‌లు.. సీపీఐ జాతీయ కార్యదర్శి కీలక వ్యాఖ్యలు
బీజేపీ ఆశించినట్లుగా గత పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వచ్చి ఉంటే ఈపాటికే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తిరగ రాసేందుకు సకల ప్రయత్నాలు చేసి ఉండేదని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఆశించినట్లుగా గత పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వచ్చి ఉంటే ఈపాటికే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తిరగ రాసేందుకు సకల ప్రయత్నాలు చేసి ఉండేదని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. మెజారిటీ రాకపోవడం వల్ల రాజ్యాంగ రక్షించబడుతోందని ఆయన పేర్కొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో భారత 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పల్లా వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రజాస్వామ్యం,లౌకికత్వం, సమాఖ్య సూర్తికి తిలోదకాలు ఇచ్చి బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో పరిపాలన కొనసాగించేందన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలు పూర్తిగా స్వేచ్ఛను కోల్పోయారన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవ్నరర్లు అందుకు భిన్నంగా ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాల మేరకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు. సమాఖ్య స్ఫూర్తిగా పూర్తి విఘాతం కలిగిస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని సీపీఐ ఎప్పటి నుంచే డిమాండ్ చేస్తోందని పల్లా వెంకటరెడ్డి గుర్తు చేశారు.






