అందాల భామల వెనుక మంత్రులు సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారు: నారాయణ షాకింగ్ కామెంట్స్

by Ramesh Naini |

తెలంగాణ, హైదరాబాద్ నగరం అంతా అందాల భామల చుట్టే తిరుగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

అందాల భామల వెనుక మంత్రులు సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారు: నారాయణ షాకింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ, హైదరాబాద్ నగరం అంతా (Miss World) అందాల భామల చుట్టే తిరుగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI National Secretary Narayana) షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో స్టేట్ పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. అందాల భామల వెనుక అధికారులు, మంత్రులంతా సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. కార్పొరేట్ కంపెనీకి అమ్ముడు పోయారని, సిగ్గుండాలి కొంచమైనా అని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు పెంచరు కానీ.. అందాల భామల కోసం కోట్లల్లో ఖర్చు పెట్టేది సొల్లు కార్చుకోవడానికా? అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి మోడీ ప్రధానినా..? ట్రంప్ ప్రధానినా..? అనేది ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. ఇష్టం ఉన్న లేకున్న దేశ ప్రధాని మోడీనే అని, కానీ ఆయన ప్రధానిలా ప్రవర్తించడం లేదని నారాయణ విమర్శించారు. దేశానికి ట్రంప్ డీ ఫ్యాక్టో ప్రధానిగా ఉన్నారని, (Narendra Modi) మోడీ డీ యాక్టివ్ ప్రధానిగా ఉన్నారని అలా ఉండటం దురదృష్టకరమన్నారు.

టెర్రరిస్టులను అడ్డం పెట్టి మోడీ సొంత రాజకీయాలు

తల్లిదండ్రులు కస్టపడి భవిష్యత్ కోసం పిల్లలను విదేశాలకు పంపిస్తున్నారని, విదేశాల నుంచి పిల్లలు పంపించే డబ్బుపైన కూడా 5 శాతం టాక్సీల పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. భారత్ పై అమెరికా పైశాచికానందం పొందుతుందన్నారు. ఇలాంటి అమెరికా విధానాన్ని మోడీ ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. ట్రంప్ యుద్ధం ఆపమంటే ఆపుతారు, కానీ అమెరికా ఆడుతున్న దోపిడీ పైశాచికత్వాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? అని నిలదీశారు. టెర్రరిస్టులను అడ్డం పెట్టుకొని మోడీ సొంత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదేనా మీ దేశ భక్తి..? టెర్రరిస్టులకు వ్యతిరేకంగా దేశం మొత్తం ఆన్ కండిషనల్‌గా మద్దతు తెలిపితే.. మోడీ మాత్రం ట్రంప్‌కు జై కొట్టి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని అన్నారు.

Next Story