Pahalgam: పహల్గామ్‌లో పర్యటించిన సీపీఐ నారాయణ.. కీలక డిమాండ్ ఇదే

by Ramesh Naini |

జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా పర్యటించారు.

Pahalgam: పహల్గామ్‌లో పర్యటించిన సీపీఐ నారాయణ.. కీలక డిమాండ్ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్ము కశ్మీర్‌లోని (Pahalgam) పహల్గామ్‌లో మంగళవారం సీపీఐ నాయకులు నారాయణ (CPI National Secretary Narayana), సయ్యద్ అజీజ్ పాషా (Syed Aziz Pasha) పర్యటించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఒక వీడియో విడుదల చేశారు. ఇక్కడ ప్రతి రెండు వందల గజాలకు ఒక ఆర్మీ క్యాంపు ఉందని చెప్పారు. ఇలాంటి చోట టెర్రరిస్ట్‌లు విచ్చల విడిగా కాల్పులకు తెగ బడ్డారని అన్నారు. పహల్గామ్ విషాద ఘటనకు కేంద్రం నిర్లక్ష్యమే కారణం అని ఆయన ఆరోపించారు. అలాగే ఆపరేషన్ సిందూర్ పై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ అనుమానాలు నివృత్తి కావాల్సి ఉందన్నారు. ఈ మేరకు పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్‌లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఏమి జరిగిందనేది తెలియాలని వెల్లడించారు. ఘటన జరిగిన తర్వాత పార్లమెంట్‌లో చర్చ జరగకుండానే.. ఎంపీల బృందాన్ని ప్రపంచం అంత పంపించారని అన్నారు. ఇదేమన్న విహారయాత్ర అని ప్రశ్నించారు. తాము ఏడు యుద్ధ విమానాలకు కూల్చివేశాని పాకిస్తాన్ చెప్పుకుంటుందని అన్నారు. సర్జికల్ స్ట్రైక్ వాళ్లు చేయలేదని చెబుతోందని తెలిపారు. మన వైపు నుంచి మాత్రం విజయం సాధించామని చెబుతున్నారని పేర్కొన్నారు. వీటిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని, అప్పుడు ప్రలకు ఒక విశ్వాసం వస్తోందన్నారు. పహల్గామ్‌లో భయంకరమైన వాతావరణం సృష్టించారని మండిపడ్డారు.

Next Story