దేశ రాజకీయ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టింది: సీపీఐ నారాయణ

by Gantepaka Srikanth |

దేశంలో రాజకీయ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయి, అవినీతి మయమైందని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కే.నారాయణ అన్నారు.

దేశ రాజకీయ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టింది: సీపీఐ నారాయణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో రాజకీయ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయి, అవినీతి మయమైందని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కే.నారాయణ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహించాల్సిన అవసరముందని, లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ఆయన పేర్కొన్నారు. ఇంటింటికీ సీపీఐ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి నారాయణ మాట్లాడారు. రాజకీయ అవినీతిని ప్రజలకు వివరించడం ద్వారా వారిని ప్రజా ఉద్యమాల వైపు ముందుకు నడిపించేందుకు ఇంటింటికి సీపీఐ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ ఉద్యమాలను నిర్వహించేందుకు కావాల్సిన వనరులను కూడా ఇందులో భాగంగా ప్రజల నుంచే సేకరిస్తున్నామని తెలిపారు.

దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అన్ని విధాలుగా భయాందోళనలకు గురువుతున్నారని, ఈ నేపథ్యంలో ఇతర రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు సైతం వెనకాడుతున్న తరుణంలో ప్రజల నుంచే విరాళాలను సేకరించడంతో పాటు ఈ దేశంలో నెలకొన్న సమస్యలను ప్రజలకు వివరిస్తున్నామని నారాయణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్‌.ఛాయాదేవి, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్‌, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్‌, నాయకులు బి.వెంకటేశం, ఎం.నర్సింహా, చంద్రమౌళి, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు ఎన్‌.శ్రీకాంత్‌, సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు చెట్టుకింద శ్రీనివాస్‌, అటుకుల రాజు ,లక్ష్మి, మదన్‌ సింగ్‌, కిష్టమ్మ కళ్యాణ్‌ అనిల్‌ , సుశాంత్‌ మనోజ్‌, భాను తదితరులు పాల్గొన్నారు.

Next Story